నానక్‌రామ్‌గూడ భూవివాదంపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టత

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో చోటుచేసుకున్న భూవివాదంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పూర్తి స్పష్టతనిచ్చారు. తనపై మరియు కుటుంబంపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసలైన రైతుల వద్దే తాము చట్టబద్ధంగా భూములను కొనుగోలు చేశామని, తమ వద్ద పక్కా లీగల్ డాక్యుమెంట్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలతో ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.