బాచుపల్లి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పద్నాలుగు నెలల పసిపాప మృతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: మేడ్చల్
బాచుపల్లి మమతా మెడికల్ ఆసుపత్రిలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వల్లనే పద్నాలుగు నెలల పసిపాప మృతి చెందిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తలకి దెబ్బ తగలడంతో ఆసుపత్రికి తెచ్చిన పాపకు శస్త్రచికిత్స అనంతరం వెంటిలేటర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిందని వారు వాపోయారు. ఎంతో కాలం నిరీక్షించి కన్న ఒక్కగానొక్క ఆడపిల్ల కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని స్థానికులు తెలిపారు.