భారత్-బ్రెజిల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై స్పందించిన దిగ్గజం కాఫు
రిపోర్టర్: విజయ్
స్థలం: నవీ ముంబై
నవీ ముంబైలోని పిళ్లై యూనివర్సిటీలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం కాఫు సందడి చేశారు. భారత్-బ్రెజిల్ మధ్య జరగనున్న అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌పై ఆయన స్పందిస్తూ, ఫుట్‌బాల్ ఆధునీకరణ చెందిందని, నేడు ఏ జట్టుకైనా సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ భారత ఫుట్‌బాల్‌కు ఎంతో మేలు చేస్తుందని, ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.