ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు: ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ భేటీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Amaravati
స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థుల ఎంపికతో పాటు కూటమి పార్టీల మధ్య వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అనివార్య కారణాల వల్ల ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారని నేతలు స్పష్టం చేశారు.