బ్లాక్‌మెయిల్, భూకబ్జాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు

రిపోర్టర్: రాము స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలో బాధితులను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేస్తూ భూకబ్జాలు, చట్టవిరద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు చందన గీత ప్రసన్నను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ ముఠాపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.