వెట్రిమారన్ దర్శకత్వంలో ఆరు గెటప్పుల్లో అదరగొట్టనున్న హీరో శింబు
రిపోర్టర్: కిరణ్
స్థలం: చెన్నై
కోలీవుడ్ స్టార్ శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో ‘అరసన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఉత్తర చెన్నై గ్యాంగ్ వార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శింబు ఆరు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మూడు గెటప్పుల షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు ‘వడా చెన్నై’ తరహాలో ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని శింబు ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతికి విడుదలపై సందిగ్ధత నెలకొంది.