హీరో డెస్ట్నీ 110 క్లాసిక్ ఎడిషన్ లాంచ్: ధర రూ.76,400

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ మార్కెట్లోకి కొత్త డెస్ట్నీ 110 క్లాసిక్ ఎడిషన్ను తీసుకువచ్చినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దీని ఎక్స్షోరూమ్ ధరను రూ.76,400గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రెట్రో స్టైల్ లుక్తో పాటు ప్రత్యేకమైన రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభించనుందని, ఇంజిన్లో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ స్పష్టం చేసింది.