ది ప్యారడైజ్ ప్రీమియర్‌కు జడల్ గెటప్‌లో వచ్చిన హర్ష్ రోషన్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా ప్రీమియర్ షోను చూసేందుకు హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌కు యంగ్ హీరో హర్ష్ రోషన్ వచ్చారు. సినిమాలో నాని పోషించిన జడల్ గెటప్‌ను పోలిన హెయిర్‌స్టైల్‌తో ఆయన థియేటర్‌కు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా తన షర్ట్ వెనుక భాగంలో తెల్ల కాగితం అక్టోబర్ 2 రిలీజ్ అని ప్రదర్శిస్తూ తన రాబోయే సినిమాకు కూడా ప్రచారం కల్పించారు. నానిపై అభిమానాన్ని చాటుకుంటూ హర్ష్ రోషన్ చేసిన ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.