'ఏ వర్గానికి నష్టం జరగకుండా నియామకాలు': వీఏఎస్ పోస్టుల భర్తీపై అధికారుల కసరత్తు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియ విధివిధానాలపై అమరావతిలో ఉన్నతాధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 60 శాతం మార్కులకు ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష, 40 శాతం మార్కులకు పాత పద్ధతిలో సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, సీనియర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఏ వర్గానికీ నష్టం వాటిల్లకుండా సీఎం తుది నిర్ణయం తీసుకోనుండగా, దీనిపై గురువారం లేదా శుక్రవారంలోగా స్పష్టత రానుంది.