సేవా సంకల్ప్ అభియాన్: కరీంనగర్లో ప్రధాని మోదీ సేవలను కొనియాడిన బండి సంజయ్
రిపోర్టర్: అశోక్
స్థలం: కరీంనగర్
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఇరవై ఐదు ఏళ్ల నిస్వార్థ ప్రజా సేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో కరీంనగర్ తీగలగుట్టపల్లిలో పాల్గొన్నట్లు బీజేపీ జాతీయ నాయకుడు బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. దేశాభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నవ భారత నిర్మాణానికై మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.