రాహుల్ గాంధీ గళాన్ని అణచివేసే ప్రయత్నమంటూ కేంద్ర ప్రభుత్వంపై కొండా సురేఖ మండిపాటు
రిపోర్టర్: నరేష్
స్థలం: వరంగల్
ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్న కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గళాన్ని అణచివేసేందుకు కుట్ర పన్నుతోందని మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఓటింగ్ హక్కులను కాపాడేందుకు యువత ముందుకు వస్తున్న వేళ ప్రభుత్వ చర్యలు భయంతో కూడుకున్నవని పేర్కొన్నారు. కోట్ల మంది భారతీయులు నిలబడుతున్న సమయంలో ఎలాంటి నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేవని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ అహంకార ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని ఆమె వెల్లడించారు.