జైలర్ 2 షూటింగ్ లొకేషన్లో మోహన్బాబు సందడి: నెట్టింట ఫొటో వైరల్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రం షూటింగ్ లొకేషన్ను టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్బాబు సందర్శించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన సెట్స్కు వెళ్లి రజినీకాంత్తో పాటు మోహన్లాల్, శివరాజ్కుమార్, ఎస్జే సూర్య, జాకీష్రాఫ్లతో కలిసి సరదాగా ముచ్చటించారు. ప్రస్తుతం ఈ లెజెండరీ నటులంతా ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.