మత్స్యకార గ్రామాల అభివృద్ధికి రూ.36 లక్షలతో శంకుస్థాపన

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా కొండరాజుపాలెం, ముక్కాం, చోడుపిల్లిపేట గ్రామాల్లో రూ.36 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.