ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో బీటెక్ యువకుడు ఆత్మహత్య

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

విశాఖలో చికిత్స పొందుతూ బీటెక్ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిధిలోని దేశపాత్రునిపాలెం కూడలికి సమీపంలో నివాసముంటున్న శివప్రసాద్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గోపాలపట్నం ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి విశాఖ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు.