అమెరికాలో వైభవంగా శ్రీ కృష్ణ వృందావన ఆలయ నవరాత్రి వేడుకలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: San Jose, USA
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ హోసే నగరంలో వెలసిన శ్రీ కృష్ణ వృందావన ఆలయంలో నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక భరతనాట్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారత్ నుంచి విచ్చేసిన ప్రముఖ కళాకారులతో పాటు స్థానిక విద్యార్థులు ప్రదర్శించనున్న నృత్యాలు ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.