ట్రూల్స్పై పీవీ సింధు ఆగ్రహం: బతుకమ్మ వేడుకలపై నెటిజన్ విమర్శలకు ఘాటు కౌంటర్

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గట్టిగా బదులిచ్చారు. తన చేతిలో ఉన్న వెండి బతుకమ్మపై ఓ నెటిజన్ చేసిన కామెంట్లను తీవ్రంగా తప్పుబట్టారు. అత్తింటి సంప్రదాయాన్ని గౌరవిస్తూ తాను స్వయంగా పెద్ద పూల బతుకమ్మను తయారు చేశానని, అత్తగారు ఇచ్చిన వెండి బతుకమ్మపై విమర్శలు తగవని పీవీ సింధు స్పష్టం చేసినట్లు ఆమె తెలిపారు.