ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్: పెట్రోల్, రవాణా ఖర్చులపై అదనపు ఛార్జీలు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు డిసెంబర్ 1 నుంచి కొత్త రుసుముల నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ సంస్థ వెల్లడించింది. దీని ప్రకారం ఒక బిల్లింగ్ సైకిల్లో ఫ్యూయల్ లావాదేవీల మొత్తం రూ.50 వేలు దాటితే ఒక శాతం అదనపు ఛార్జీ వర్తిస్తుందని, అలాగే రవాణా సంబంధిత లావాదేవీలు రూ.30 వేలు దాటినా అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.