గజ్వేల్లో దారుణం: మురికి కాలువ నీటితో పంటను కాపాడుకుంటున్న అన్నదాత ఆవేదన

రిపోర్టర్: కిరణ్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం షేర్పల్లి గ్రామానికి చెందిన కూరాకుల కనకయ్య అనే చిన్నకారు రైతు తనకున్న ఎకరంన్నర భూమిలో వరి సాగు చేశాడు. సాగునీరు అందక చేతికందిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో ఆవేదన చెందిన ఆయన, మురికి కాలువ నీటినే ‘ఏతం’ ద్వారా మళ్లకు పారిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వర్షాభావం, కరెంటు కోతల వల్ల అన్నదాతలు పడుతున్న కష్టాలకు ఈ ఘటన అద్దం పడుతోందని కూరాకుల కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.