ఛలో చింతకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ అంటూ బీజేపీ ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Karimnagar

వినాయక నిమజ్జనోత్సవాల కోసం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని కోరుతూ బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో చింతకుంట కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దమనకాండకు పాల్పడిందని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ద్వేషాన్ని నరనరాన నింపుకున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజాశాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.