అధికారుల నిర్లక్ష్యపు నీడలో విలవిల్లాడుతున్న అనికేపల్లి ప్రజల బతుకులు

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర అవసరాలకు ఉపయోగపడే గ్రామపంచాయతీ నీటి బావి దుస్థితి అధ్వానంగా తయారైంది. ఈ సమస్యపై స్థానికులు పంచాయతీ అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.