వానదేవుడి కరుణకై గుట్టపై మోకరిల్లిన పల్లెజనం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. అనంతరం తేలికపాటి చినుకులు కురుస్తూనే ఉన్నాయి. ఈ అకస్మిక వర్షంతో స్థానిక రైతుల్లో నూతన ఉత్సాహం నేలకొంది. భూమిలో తేమ ఒక్కసారిగా పెరగడంతో పత్తి, వరి, మక్క పంటల ఎదుగుదలకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు వేగవంతం కావడంతో ఈసారి మంచి దిగుబడులు వస్తాయని అన్నదాతలు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.