ఆరోగ్యానికి వరం: భోజనం తర్వాత ఎంత సేపు నడవాలో తెలుసా

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం తిన్న వెంటనే ఐదు నుంచి ఇరవై నిమిషాల పాటు నడవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కూర్చునే సమయానికి విరామం ఇస్తూ క్రమం తప్పకుండా నడకను అలవాటు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వైద్యులు వెల్లడించారు.