వైద్య రంగంలో సంచలనం: హెచ్ఐవీ నివారణ ఇంజెక్షన్ కు ఎఫ్డీఏ తాత్కాలిక అనుమతి

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

భారతీయ ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరిస్ తయారు చేసిన లెనాకాపావిర్ జెనరిక్ ఇంజెక్షన్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అనుమతి మంజూరు చేసిందని వైద్య నిపుణులు తెలిపారు. హెచ్ఐవీ నివారణ రంగంలో ఇది ఒక విప్లవాత్మక పురోగతి అని, ఈ ఇంజెక్షన్ను ఏడాదికి కేవలం రెండు సార్లు తీసుకుంటే సరిపోతుందని వారు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి రానున్న ఈ ఔషధం ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.