దుర్గగుడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా కొణిదెల సుస్మిత నియామకం?
రిపోర్టర్: శివ
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలిలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం లేదా దేవాదాయ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దేవాదాయ శాఖ నుంచి జీవో వెలువడితేనే ఈ నియామకంపై పూర్తి స్పష్టత రానుంది.