గాంధీ సిద్ధాంతాలకు పాలకుల తూట్లు: నెల్లూరులో వైఫల్యాలపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాలకుల ఆచరణలో విస్మరిస్తున్నారని నెల్లూరులో సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. జయంతి, వర్ధంతుల వేళ కేవలం దండలు వేయడం మినహా ఆచరణ శూన్యమైందని పేర్కొన్నారు. హింస, భూకబ్జాలు, అధికారుల లంచావతారాలతో సమాజంలో అశాంతి పెరుగుతోందని, స్వదేశీ సంస్కృతిని మరిచి విదేశీ వస్తువుల వాడకం పెరిగిందని తెలిపారు. పేదల అసైన్డ్ భూముల ఆక్రమణలు, ఏసీబీ దాడుల ఉదంతాలు గాంధీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాయని హెచ్చరించారు.