చిన్న పరిశ్రమల అభివృద్ధికి పదివేల కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు పదివేల కోట్ల రూపాయలతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని G Kishan Reddy వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో Tier-II మరియు Tier-III నగరాల్లోని పరిశ్రమలకు ఈ నిధులు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని పేర్కొన్నారు. అలాగే మోదీ పరిపాలనకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేబినెట్ ప్రత్యేకంగా అభినందన తీర్మానం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.