అమెరికాలో ఎఫ్-వన్ విద్యార్థులకు భారీ షాక్: ఓపీటీ ఫీజు డెబ్బై వేల డాలర్లు
రిపోర్టర్: హరి
స్థలం: Washington
అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న ఎఫ్-వన్ వీసా విద్యార్థులకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం భారీ షాక్ ఇచ్చింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థులకు డెబ్బై వేల డాలర్ల మేర కొత్త ఫీజును ప్రతిపాదించినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగ కార్యక్రమాల్లో మోసాలను అరికట్టడంతో పాటు అమెరికన్ కార్మికులకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.