మంచినీటి ఎద్దడిపై ఆందోళన: కె.కోటపాడులో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కె.కోటపాడు
కె.కోటపాడు మండలం కోరువాడ గ్రామంలో మంచినీటి ట్యాంక్ బోరు మరమ్మతుకు గురికావడంతో దాదాపు నాలుగు రోజులుగా వంద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నీటి కోసం మహిళలు కూలి పనులు మానుకుని ఇతర ప్రాంతాల చేతిబోర్లపై ఆధారపడుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు వాటర్ ట్యాంక్ వద్ద ఆందోళన చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి స్పందించి గురువారం నాటికి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.