సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వెదర్‌మ్యాన్
రిపోర్టర్: మహేష్
స్థలం: Telangana
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతాల మధ్య రానున్న గంటపాటు అత్యంత తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ టి.బాలాజీ హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గురువారం ఆయన అప్రమత్తత ప్రకటన జారీ చేశారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు.