హైదరాబాద్ లో తీవ్ర తాగునీటి ఎద్దడి ముప్పు: ఆందోళనలో జలమండలి అధికారులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ముంచుకొస్తోందని జలమండలి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో మంజీరా, సింగూరు జలాశయాల్ లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని వారు తెలిపారు. ఐటీ కారిడార్ తో పాటు పలు ప్రాంతాల్ లో భూగర్భ జలాలు అడుగంటిపోయి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని, ప్రతి చుక్కను పొదుపుగా వాడాలని అధికారులు సూచించారు.