ఘాట్ రోడ్డుపై చిరుతపులి సంచారం, వాహనదారులు భయాందోళన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నెల్లూరు
నెల్లూరు-అన్నమయ్య జిల్లాల సరిహద్దులోని రాపూరు-చిట్వేలు ఘాట్ రోడ్డుపై చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి రక్షణ గోడపై చిరుత నిద్రిస్తుండగా కారు హెడ్లైట్ల వెలుగుకు మేల్కొని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. తరచూ వన్యప్రాణులు రోడ్డుపైకి వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణించవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.