ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీష్ రావు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సిద్దిపేట
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని, సర్టిఫికెట్లు రాక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు చేయడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని యువత పడుతున్న గోసపై ఎందుకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన తీవ్రస్థాయిలో నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్న ప్రభుత్వ వైఖరిని తక్షణమే మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.