తుపాను ముప్పుపై విజయనగరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ తనిఖీ

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం సందర్శించి అధికారులతో సమీక్షించారు. రాత్రి తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు.