మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: జగన్ డిమాండ్
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
మెగా డీఎస్సీలో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ కోటా అక్రమాలపై చంద్రబాబును నిలదీశారు. అక్షరాస్యత గణాంకాలపై విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన జగన్, రెడ్ బుక్ పాలనపై కాకుండా శాఖపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అక్రమాల వెనుక సీఎం, ఆయన తనయుడు ఉన్నారని ఆరోపించారు.