నిర్మల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడిగా సంతోష్ నాయక్ నియామకం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
బిజెపి ఎస్టీ మోర్చా నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా జన్నారం మండలానికి చెందిన సంతోష్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. హాస్టల్ తండాకు చెందిన సంతోష్ నాయక్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ పదవి అప్పగించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా అభినందనలు తెలియజేశారు.