డిండి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలంటూ జూలకంటి రంగారెడ్డి డిమాండ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: నల్లగొండ
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం రిజర్వాయర్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల పాదయాత్రను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లోరైడ్ పీడిత మునుగోడు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించడానికి డిండి ప్రాజెక్టే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నేతలు ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదన్నారు.