సీతారామపురం ఎంపీపీ పీఠం కైవసం: ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
రిపోర్టర్: వెంకట్
స్థలం: సీతారామపురం
సీతారామపురం మండలంలో ఎంపీపీ పీఠాన్ని తెలుగు దేశం పార్టీ కైవసం చేసుకుందని ఎన్నికల అధికారి పార్లపల్లి చెన్నారెడ్డి తెలిపారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఆయన ప్రకటించారు. ఇందులో తెలుగు దేశం తరఫున ఆరుగురు, జనసేన అభ్యర్థి ఒకరు విజయం సాధించారని పేర్కొన్నారు. విజయం సాధించిన అభ్య్రధులకు ఎన్నికల అధికారులు అధికారికంగా ధ్రువీకరణ పత్రాలు అందజేయడంతో స్థానిక నాయకులు వారికి అభినందనలు తెలిపారు.