బెంగళూరులో స్థానిక ఉద్యోగాల వివాదం: డికే శివకుమార్ కీలక ప్రకటన

రిపోర్టర్: హరి స్థలం: బెంగళూరు

బెంగళూరులోని కాలేజీల్లో కన్నడ మాట్లాడే అభ్యర్థులను ఇంటర్వ్యూలలో తిరస్కరిస్తున్నారంటూ యువతి చేసిన వీడియో వైరల్ కావడంతో స్థానిక ఉద్యోగాల అంశం మళ్లీ దుమారం రేపింది. కన్నడిగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధ్యత వహిస్తుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ స్పష్టం చేశారు. వారి ఆందోళనలను పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ రంగంలో స్థానికులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.