క్రికెట్ అభిమానులకు తీపి కబురు: చెన్నైలో తొలిసారిగా బిగ్ బాష్ లీగ్

రిపోర్టర్: హరి స్థలం: చెన్నై

ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్ తొలిసారి భారత్లో అడుగుపెడుతోందని నిర్వాహకులు తెలిపారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా డిసెంబర్ 12న మెల్బోర్న్, పెర్త్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరగనుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ చారిత్రక మ్యాచ్కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయని జొమాటో వెబ్సైట్ ద్వారా తెలిపారు. భారత్లోని క్రికెట్ ప్రేమికుల కోసం జియోస్టార్లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.