వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని వరుసగా రెండో రోజైన మంగళవారం అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇదే కేసులో ఏ3గా ఉన్న ఉమాశంకర్రెడ్డి కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. హత్య కోసం పెద్దఎత్తున డబ్బు సర్దుబాటు చేశారన్న ఆరోపణలపై వారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా ఆరా తీసినట్లు సమాచారం.