'టీడీపీలోకి బొత్స మేనల్లుడు': చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న చిన్న శ్రీను

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఈ చేరిక కార్యక్రమంలో ఉండి మద్దతు తెలిపారు.