విజయనగరం జిల్లాలో ఘోరం: కలెక్టర్ ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న లారీ
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం బూసాయవలస జాతీయ రహదారి వద్ద కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును ఐరన్ లోడ్‌తో వస్తున్న లారీ బుధవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ కలెక్టర్‌తో పాటు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని ఎస్సై జ్ఞాన ప్రసాద్ తెలిపారు. ప్రమాదం అనంతరం ఆపకుండా వెళ్లిన లారీని పోలీసులు వెంబడించి పాచిపెంట మండలం వద్ద పట్టుకున్నారు. మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.