పెంటగాన్ లో సోషల్ మీడియా స్టార్స్ జేక్ లోగన్ పాల్ పర్యటనపై వ్యతిరేకత

రిపోర్టర్: అశోక్ స్థలం: United States

అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ లో సోషల్ మీడియా స్టార్స్ జేక్ పాల్, లోగన్ పాల్ పర్యటించడం ఆన్‌లైన్‌లో తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ పర్యటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి పెట్ హెగ్‌సెత్‌ను కలవడంతో పాటు సైనికులను ఉద్దేశించి వారు మాట్లాడటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.