ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక: పుత్తూరు మండలంలో నూతన నాయకుల నియామకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పరమేశ్వరమంగళం
తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గో టూ విలేజ్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో జిల్లా కో ఇంచార్జ్ పునబాకు మునివేలు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మందకృష్ణ మాదిగ సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా పర్రి యుగంధర్ తో పాటు పలువురు నాయకులను ఎన్నుకున్నారు.