హైదరాబాద్ వర్సిటీల్లో పెరుగుతున్న విదేశీ విద్యార్థుల ప్రవేశాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఉస్మానియా, హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ సహా పలు వర్సిటీల్లో చదివేందుకు ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాల విద్యార్థులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. 80 దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా విదేశీ విద్యార్థులు చదువుతున్న వర్సిటీల్లో ఉస్మానియా రెండో స్థానంలో నిలిచింది.