స్పీకర్‌పై బీఆర్‌ఎస్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య చరిత్రకు మాయని మచ్చ: భట్టి
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభలో స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్య చరిత్రకే మాయని మచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించడం ఫ్యూడల్ అహంకార భావజాలానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ ఘటన సభాపతికే కాకుండా మొత్తం శాసనసభా పీఠానికి జరిగిన తీవ్ర అవమానమని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.