ఢిల్లీలో భవనం కూలి ఏడుగురు మృతి, పీజీ యజమాని అరెస్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

ఢిల్లీ సత్య నికేతన్‌లో విద్యార్థుల పీజీ భవనం కూలిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు పీజీ యజమాని హరిరామ్ గుప్తాను రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు ఎంసీడీ అధికారులను సస్పెండ్ చేశారు. ప్రమాదకర భవనాల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు.