శ్రీకాకుళంలో త్రిశూల్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: శ్రీకాకుళం

విద్యార్థినుల భద్రత మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆత్మరక్షణ టైక్వాండో శిక్షణా తరగతులను ప్రారంభించినట్లు గోండు శంకర్ శ్రీకాకుళమా వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో త్రిశూల్ వేదికగా మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం ప్రాంతంలో బాలికలు, మహిళల రక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.