గణేష్ నిమజ్జన వేడుకలకు ముమ్మరంగా సాగుతున్న పటిష్ట ఏర్పాట్లు
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూర్
మోత్కూర్ మున్సిపల్ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జి.నర్సయ్య ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. నిమజ్జన ప్రాంతంలో సీసీ కెమెరాలు, విద్యుత్ లైటింగ్, బ్యారికేడ్లు, తాగునీరు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ పి.జ్యోతి, సీఐ వెంకటేశ్వర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.