అతిపెద్ద టైటిల్‌తో వస్తోన్న దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ చిత్రం!

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌ తెరకెక్కిస్తున్న కొత్త సైకలాజికల్‌ మిస్టరీ మ్యూజికల్‌ చిత్రానికి “ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” అనే అత్యంత సుదీర్ఘమైన టైటిల్‌ను ఖరారు చేశారు. న్యూరోసైన్స్‌, బ్రెయిన్‌ మ్యాపింగ్‌, సంగీతం, ప్రేమ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ సినిమాలో హర్ష హీరోగా నటిస్తుండగా, విభిన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.